Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్21న ఏజెన్సీ బంద్ కు ఆదిలాబాద్ సీపీ(ఎం) మద్దతు

21న ఏజెన్సీ బంద్ కు ఆదిలాబాద్ సీపీ(ఎం) మద్దతు

- Advertisement -

జీవో 49 రద్దు చేయాలి
సీపీ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

ఆదివాసులకు ఉరితాడుగా మారిన జీవో 49ని రద్దుచేయాలని కోరుతూ ఈ నెల 21న ఆదివాసీ సంఘాలు తలపెట్టిన ఏజెన్సీ బంద్ కు సీపీ(ఎం) జిల్లా కమిటీ  సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సీపీ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కనుసైగతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొమురం భీమ్ కన్జర్ వేషన్ కారిడార్  పేరిట ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల ఆదివాసీ ప్రజలు తమ ఊరికి, భూములకు దూరం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నాయని పేర్కొన్నారు.

రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 1/70  పీసా చట్టాలను ఉల్లంగిస్తూ ఈ జీవోను ఇచ్చారని అన్నారు. ఆదివాసులను తరిమి వేశాక తదనంతరం అడవిని, అడవిలోని ఖనిజ, సహాజ వనరులను అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగమే టైగర్ కారిడార్ అని అన్నారు. అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసుల పట్ల ఇంతటి కఠిన నిర్ణయం సహించరానిదని, ఆదివాసుల మనుగడ కోసం జరుగుతున్న జిల్లా బంద్ లో ఆదివాసులకు మద్దతుగా  పార్టీ శ్రేణులు జిల్లా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -