Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: : ఆదిత్య ఫార్మసి ఎండి నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు. అయోధ్యనగర్‌ క్షత్రియభవన్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు.. ఇటీవలే బెయిల్‌ పై బయటకు వచ్చారు. నరసింహమూర్తి రాజు నిన్న రాత్రి హైదరాబాద్‌ నుండి విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల్లో అప్పు ఉన్నట్లు సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహమూర్తి రాజు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad