నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన క్యాలెండర్‌ను కాటారం డిఎస్పి సూర్యనారాయణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ, స్వయంపాలన, రాజ్యాంగ హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఆదివాసి సమాజంతో పాటు ఇతర పేద వర్గాల్లో నెలకొన్న సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ నూతన క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు వివరించారు.
క్యాలెండర్ ఆవిష్కరణకు సహకరించిన డిఎస్పి సూర్యనారాయణ గారికి సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సూదుల శంకర్, జిల్లా కమిటీ సభ్యులు మద్దుకూరి శ్రీను, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



