ఓపెన్ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ రవి..
నవతెలంగాణ – అచ్చంపేట
ఆదిమ చెంచు తెగకు చెందిన అభ్యర్థులకు రూ.500 కే ఓపెన్ డిగ్రీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు కొండానాగుల ఓపెన్ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ రవి గురువారం నవతెలంగాణతో తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా వర్తిస్తుందన్నారు. వాస్తవానికి ఓపెన్ డిగ్రీలో ప్రవేశం పొందేందుకు జర్నల్ కేటగిరీకి చెందిన వ్యక్తులు 3500 రూపాయలు చెల్లించి ప్రవేశం పొందవలసి ఉంటుందన్నారు. చెంచు తెగలు అక్షరాత శాతం పెంచేందుకు ప్రభుత్వం ₹500 డిగ్రీల ప్రవేశం కల్పిస్తుందన్నారు. ఇప్పటికే కొందరు చెంచు యువకులు కులం, ఆదాయం, సర్టిఫికెట్లు ఆధార్ కార్డు జత చేసి డిగ్రీలో ప్రవేశం పొందారని తెలిపారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చూపించారు.
ఆదివాసులకు రూ.500 కే డిగ్రీలో ప్రవేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES