నవతెలంగాణ-బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 2026-27 విద్య సంవత్సరానికి గాను ఐదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ చందన మంగళవారం పేర్కొన్నారు. మండల పరిధిలోని మైనార్టీ విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.2026 -27 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందదలచిన బాలికలు అడ్మిషన్ల కొరకు tmries.cgg.gov.in లో అప్లై చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఐదవ తరగతిలో ముస్లిం మైనారిటీ – 28, క్రిస్టియన్ మైనారిటీ – 2, బిసి – 5, ఎస్సీ – 2, ఎస్టి – 2, ఓసి – 1, అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ముస్లిం మైనారిటీ – 56, క్రిస్టియన్ మైనారిటీ – 4, బిసి -10, ఎస్సీ- 4, ఎస్టి -4, ఓసి -2 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ చందన కోరారు.
గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



