Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శలో 6వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు 

ఆదర్శలో 6వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి కి ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి అడ్మిషన్ల కోసం ఈనెల 28 లాస్ట్ అని వెల్లడించారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 19వ తేదీన అడ్మిషన్ల కోసం పరీక్ష నిర్వహిస్తారని అన్నారు.

ఆరవ తరగతి ప్రవేశ పరీక్షల లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి నగదు బహుమతి రూ.3000, ద్వితీయ స్థానంలో గెలుపొందిన విద్యార్థికి రూ.2000, తృతీయ స్థానంలో గెలుపొందిన విద్యార్థులకు రూ.1000 నగదు బహుమతి అందజేస్తామని అన్నారు. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కాళీ ఉన్న సీట్లలో బర్తి కోసం దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -