న్యూయార్క్: అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం అడోబ్‌ను దాదాపు రెండు దశాబ్దాలు నడిపించిన భారత సంతతి వ్యక్తి శంతను నారాయణ్ సిఇఒ పదవి నుంచి వైదొలగనున్నారు. తన రాజీనామా నిర్ణయానికి బోర్డు అంగీకరించిందని, తదుపరి చీఫ్ ఎంపిక తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. అయితే బోర్డు ఛైర్మన్‌గా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. 2007లో అడోబ్ సిఇఒగా బాధ్యతలు చేపట్టిన 62 ఏళ్ల శంతను, తన నాయకత్వంలో కంపెనీకి రికార్డు ఆదాయాన్ని, డిజిటల్ మీడియా రంగంలో తిరుగులేని గుర్తిం పును తెచ్చిపెట్టారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన విశేషకృషికి గా నూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.



