- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పెద్దపల్లి(D) సుల్తానాబాద్(M) కోమడ్లపల్లిలో ఆస్తి కోసం పెంచిన తల్లిని గొంతు నులిమి హత్య చేసిన దారుణం చోటు చేసుకుంది. దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన ఐలవేని భాగ్యమ్మ(65)ను ఆమె కుమారుడు ఐలవేని సాయి హత్య చేశాడు. భర్త మరణం తర్వాత మద్యానికి బానిసైన సాయి, ఆస్తి తనకే దక్కుతుందనే దురాశతో ఆదివారం రాత్రి మద్యం తాగించి, గొంతు నులిమి చంపాడు. అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భాగ్యమ్మ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



