నవతెలంగాణ– కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని సమస్త దివ్యాంగులకు, దివ్యాంగుల అసోసియేషన్స్, ఫోరమ్స్, ట్రస్టు సంఘాల యొక్క అధ్యక్షులకు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమావళి, 2018 దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 సెక్షన్ 101 (1), (2) ననుసరించి జిల్లా స్థాయిలో దివ్యాంగుల కమిటీని ఏర్పాటు నిర్ణయించిందని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారులు రసూల్ బి శనివారం ప్రకటనలో తెలిపారు .కావున జిల్లా స్థాయిలో వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగుల కొరకై పాటు పడుతున్న ప్రభుత్వేతర అభ్యర్థులు (ఎన్జీవో ఎస్) దివ్యాంగుల అభ్యున్నతికై పాటుపాడుచున్న వారి నుండి ప్రతిపాదనలు స్వీకరించబడుచున్నవి. ఇట్టి కమిటీ నందు షెడ్యూల్డ్ కులము (ఎస్.సి) వర్గానికి చెందిన అభ్యర్థి లేక షెడ్యూల్డు తెగలు (ఎస్.టి) వర్గానికి చెందిన అభ్యర్థి 01, మహిళ అభ్యర్థి – 01, మిగతా సభ్యులు 03 ఉండవలెను అని తెలిపారు. కావున వివిధ రంగాలలో నిష్ణాతులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో పాటు వారు దివ్యాంగులకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వివరములు. పత్రికా ప్రకటనలు, ప్రశంసా పత్రాలు మొదలగునవి జతపరచి జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ కార్యాలయము నందు సమర్పించినచో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయుటకు తదుపరి చర్య గైకోనబడునని తెలియజేశారు. ప్రతిపాదనలను పత్రిక ప్రకటన విడుదల అయిన నాటి నుండి (07) రోజుల లోగా అనగా తేది 31-05-2025 లోగా ఈ కార్యాలయము నందు సమర్పించగలరు అని తెలియజేశారు. ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్దుల శాఖ. నిజామాబాద్ కార్యాలయును అన్ని కార్యాలయ పనివేళలలో సంప్రదించగలరు అని తెలిపారు.
దివ్యాంగుల కమిటీని ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES