- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ ఒటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలోని తమ వినియోగదారులకు స్ట్రీమింగ్ మధ్యలో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ మంగళవారం పేర్కొంది. జూన్ 17వ తేదీ నుంచి సినిమాలు, టీవీ షోల ప్రసార సమయంలో ప్రకటనలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే ప్రకటనలు చూడటానికి ఇష్టపడని వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన యాడ్ ఫ్రీ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది.
- Advertisement -