Sunday, March 29, 2026
E-PAPER
Homeకవితకల్తీ ప్రేమ - చీకటి సాక్ష్యం

కల్తీ ప్రేమ – చీకటి సాక్ష్యం

- Advertisement -

నిశ్శబ్ద చాయలుల్లో
నిగూఢ అర్థాలతో కల్తీ ప్రేమ కన్నీళ్ళకు
సాక్ష్యంగా మారింది గీయాల..
మూడుముళ్ల బంధం
విలువ లేని తాడుగా మారి
విషపు కోరలు చాచి
వికతాకారాలను చూపింది
పద్దెనిమిదేళ్ల నిండు ప్రాణం
నాలుగు నెలల రక్తపు ముద్ద బలి అయింది…
ఎవరిది తప్పు..!
ప్రేమను నమ్మిన అమ్మాయిదా?
లేని ప్రేమను నటించిన అబ్బాయిదా?
ఎవరిదో మరి కాలం కన్నెర్ర జేసి కత్తితో
వేటాడింది గీయాల కన్నోల కడుపుకోతకు
కట్టుకున్నోడిచ్చిన కన్నీళ్ళ బహుమతి..
వెన్నుపోటు..
నమ్ముకున్నోడే నరరూప రాక్షసుడు అయితే
కట్టుకున్న దాని బతుకు కన్నీళ్ల సంద్రమే…
ప్రేమను నమ్మి వచ్చిన
అమ్మాయికి వరకట్నపు అక్షింతలు జల్లి
పాడెపై పూలు జల్లే అగంతకులు ఎందరో!
అడ్డు అదుపు లేని అరాచకాలకు..
ఆడదాని విలువ ఎప్పుడు తెలుస్తుందో!
ఇవాళ ప్రశ్నించే గొంతులు మాట్లాడాలి…
హంతకులను హతమార్చాలని
‘నేను మగాడిని నన్నెవరూ
ఏం చేయలేరు’ అంటూ
మగ ఆధిపత్యాన్ని అహంకారాన్ని
చెలాయిస్తూ… ఆస్తులు, వరకట్నం
అనే మత్తులో మగాలుగా మారుతూ..
మానవత్వాన్ని మరిచి విజ్ఞాన కాలంలో
అజ్ఞాన ముసుగులేసుకుని
మూర్ఖులవుతున్న మనుషులేందరో!
కలియుగపు కల్తీ ప్రేమలో
చీకటి సాక్ష్యాలుగా మారి
శిథిలమైన బ్రతుకులకు న్యాయం ఎక్కడ…?

జుర్కి లావణ్య, 8309495388

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -