Friday, December 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకల్తీ పెట్రోల్.. ఆపై బెదిరింపులు 

కల్తీ పెట్రోల్.. ఆపై బెదిరింపులు 

- Advertisement -

– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు 
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓ వ్యక్తి తన కారులో పెట్రోల్ పోయించుకోవడంతో అందులో నీళ్లు వచ్చాయి. దీంతో ఇదేమిటని పెట్రోల్ పంపు సిబ్బందిని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు అనడమే కాకుండా ఏమైనా చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని సదర్ బాధితుడు పేర్కొంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని గుమస్తా కాలనీకి చెందిన మాధవరావు అనే వ్యక్తి శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీలో గల కాలభైరవ పెట్రోల్ పంపులో  పెట్రోల్ పోసుకున్న కొద్ది దూరంలోనే తన వాహనం నిలిచిపోయింది. వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని పంపు సిబ్బందిని అడిగేందుకు మాధవరావు వెళ్తే.. సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొంటున్నారు. ఇలా పెట్రోల్ కల్తీ చేసే పంపుపై అధికారులు వెంటనే స్పదించి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అధికారులకు ఫోన్ చేసినా.. ఎలాంటి స్పందన లేదని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -