జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ రాజగోపాల్ కు వినతి
నవతెలంగాణ- మ ల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రి ఓపెన్ చేయాలని బిఆర్ఎస్ యూత్ నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్ శుక్రవారం భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ రాజగోపాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం అనివార్య కారణాల వలన ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు ప్రయివేటు పాఠశాలకు వెల్లడమే కాకుండా రెండు,మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. గ్రామంలో ప్రాథమిక విద్యను చదివేవారు 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిపారు. కావున ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్కూల్ రి ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అడ్వాలపల్లి ప్రాథమిక పాఠశాలను రి ఓపెన్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



