– మంత్రి పొన్నం ప్రభాకర్
– ఇంజినీరింగ్, శానిటేషన్, లైటింగ్, వ్యర్థాల నిర్వహణపై సమీక్ష
– జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా ప్రజలు సమస్యలు తెలపాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాబోయే వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ, రవాణ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఎస్‌ఆర్‌డిపిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. శిల్ప లే ఔట్ రెండో దశ పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉందని ప్రాజెక్టు సీఈ భాస్కర్ రెడ్డి మంత్రికి వివరించారు. పూడిక తీత పనులు వెంటనే చేపట్టి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, మొబైల్ స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. జవహర్‌నగర్ డంప్ యార్డ్‌పై భారం పడుతుండటంతో ప్రత్యామ్నాయ డంప్ యార్డు ఏర్పాటుకు స్థలాలు అవసరమని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ మంత్రికి వివరించారు. డంప్ యార్డు కోసం స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని తన దృష్టికి తెస్తే.. ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని మంత్రి చెప్పారు. చెత్త కనపడినా, వీధి లైట్లు వెలగకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సుందరీకరణ పనులు పూర్తి చేయాలని, స్లమ్ ఏరియాల్లో కూడా అవసరమైన ప్రదేశాల్లో చేపట్టాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వీటి కోసం ప్రభుత్వం తరపున జీహెచ్‌ఎంసీకి అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే జీహెచ్‌ఎంసీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ ఆర్‌వి.కర్ణన్, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వర్షాకాలం ముందస్తు ప్రణాళికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES