- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని శానిటేషన్ వర్కర్స్, వాటర్ కార్మికులకు, ఎలక్ట్రిషన్లకు, శానిటేషన్ డ్రైవర్స్, ఆఫీస్ స్టాఫ్ వారికి శనివారం రోజున సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలని మూడు రోజుల ముందే చెల్లించడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాల చెక్కుని వారికి అందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ… పండగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని, వచ్చే జీతం డబ్బుల పైన వారి జీవనం సాగుతుంది కాబట్టి వారికి మూడు రోజుల ముందు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గోపి గంగాధర్ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -