Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో అడ్వాన్స్‌డ్‌ రెడ్‌ సెల్‌ సిరాలజీ వర్క్‌షాప్‌

నిమ్స్‌లో అడ్వాన్స్‌డ్‌ రెడ్‌ సెల్‌ సిరాలజీ వర్క్‌షాప్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిమ్స్‌ ఆరోగ్య, పరిశోధనా శాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నిమ్స్‌ ఇమ్యునో-హీమటాలజీ, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ విభాగం సంయుక్తంగా ”అడ్వాన్స్‌డ్‌ రెడ్‌ సెల్‌ సిరాలజీ” అనే అంశంపై బుధవారం వర్క్‌ షాప్‌ నిర్వహించాయి. ఈ వర్క్‌షాప్‌నకు నిమ్స్‌ ఇమ్యునో-హీమటాలజీ బ్లడ్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బోనగిరి శాంతి ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని అదనపు ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్‌ ఉజ్జిని సుధీర్‌ కుమార్‌, అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ సమన్వయపరిచారు. గెస్ట్‌ ఫ్యాకల్టీగా డాక్టర్‌ స్వాతి కుల్‌కర్ణి (ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఐహెచ్‌, ముంబయి), డాక్టర్‌ సుధా రంగనాథన్‌ (అపోలో హాస్పిటల్‌), డాక్టర్‌ చుంచు శ్రీనివాస్‌ (ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌), డాక్టర్‌ అరుణ్‌.ఆర్‌ (ఎయిమ్స్‌, బీబీనగర్‌) పాల్గొన్నారు.

వర్క్‌షాప్‌లో నిపుణులు మాట్లాడుతూ రక్త మార్పిడి భద్రత, రోగి సంరక్షణలో యాంటీబాడీ స్క్రీనింగ్‌, యాంటీబాడీ ఐడెంటిఫికేషన్‌, అడ్సార్ప్షన్‌, ఎల్యూషన్‌ వంటి అధునాతన సిరాలజీ పద్ధతులు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ పద్ధతులు పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో ఖచ్చితమైన రక్త గ్రూప్‌ ఎంపిక, రక్త మార్పిడి ప్రతి చర్యల నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. భవిష్యత్తులో రక్త సంబంధిత పరిశోధనలకు, క్లినికల్‌ డయగస్టిక్స్‌లో కొత్త పద్ధతుల అభివృద్ధికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. వర్క్‌షాప్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు యాంటీబాడీ స్క్రీనింగ్‌, ప్యానెల్‌ ఇంటర్‌ప్రిటేషన్‌, ఎల్యూషన్‌, అడ్సార్ప్షన్‌, కంపాటిబిలిటీ టెస్టింగ్‌ వంటి నాలుగు ప్రాక్టికల్‌ సెషన్లు జరిగాయి. సాయంత్రం క్విజ్‌ సెషన్‌ నిర్వహించి సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ బ్లడ్‌ సెంటర్‌ సిబ్బంది బిడుగు శేఖర్‌, వెంకటరత్నం, పద్మజా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -