Tuesday, July 1, 2025
E-PAPER
HomeNewsఆర్టీసీలో అధునాతన సంస్కరణలు

ఆర్టీసీలో అధునాతన సంస్కరణలు

- Advertisement -

– ఓఆర్‌ఆర్‌ లోపల కాలనీలకు బస్సులు
– బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– ముషీరాబాద్‌ ఆర్టీసీ డిపోను సందర్శన
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ఆర్టీసీ సంస్థలో అధునాతన సంస్కరణలు తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపోలో అధునాతన టెక్నాలజీ ద్వారా అమలు చేస్తున్న డిజిటల్‌ పేమెంట్స్‌ను సోమవారం ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఆర్టీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ముషీరాబాద్‌ డిపోకు చెందిన ఏడుగురి (డ్రైవర్‌ కండక్టర్‌లు, హెడ్‌ ఆఫీస్‌కు చెందిన అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌) ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా 29 సంవత్సరాలు డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన నరేందర్‌, హెల్పర్‌ యాదగిరిని ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకొని డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా టికెట్‌ తీసుకుని బస్సులో ప్రయాణించేలా కొత్త కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు నెలలుగా 16 -20 శాతం డిజిటల్‌ పేమెంట్స్‌ పూర్తి చేసినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ పూర్తయ్యాయన్నారు. దాని డేటా అప్‌డేట్‌ హెడ్‌ ఆఫీస్‌లో వెంటవెంటనే వస్తుందని చెప్పారు. ఆ బస్సులో ఎంత మంది ఉన్నారు.. ఎంత మంది మహాలక్ష్మి ప్రయాణికులున్నారో తెలుస్తుందన్నారు. ఆదాయం ఎంత వస్తుందో కూడా చూసుకోవచ్చన్నారు. ఢిల్లీ మాదిరి ఇక్కడా కాలుష్యం ఉండకుండా ఈవీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కాలనీలకు ఓఆర్‌ఆర్‌ లోపల బస్సు రూట్‌లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యాలు పెంచేలా చేస్తున్నామని చెప్పారు. చెక్‌ పోస్టులపై కేంద్రం ప్రతిపాదనలో ఉందనీ.. నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. వాహన సారథిలో 10 సంవత్సరాలుగా తెలంగాణ లేదని, తమ ప్రభుత్వం రాగానే ఎన్‌ఐసీ ద్వారా వాహన సారథిలోకి వచ్చామన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ మార్చామని తెలిపారు. ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్టులను సాంకేతికంగా చేసేలా మార్పులు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -