నవతెలంగాణ- ఆలేరు టౌన్
ఆలేరు, పరిసర ప్రాంత పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు, కార్పొరేట్ స్థాయికి ధీటుగా, పట్టణంలో ఐటిఐ కళాశాల వద్ద ఏఐటిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్మన్ ,బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం ప్రభుత్వ ఉపాధి పారిశ్రామిక శిక్షణ, ఐటిఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా, ఐటిఐ ,ఏటీసీ లో ప్రవేశాల కొరకు, ఆసక్తిగల యువతి యువకులకి స్వల్పకాలిక కోర్సులకు, షార్ట్ టర్మ్ కోర్సులు [స్వల్పకాలిక కోర్సులు] రెండు వారల వ్యవధి లో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తరగతుల సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రిన్సిపల్ బి హరికృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏటిసి సంస్థ ఏర్పాటులో కీలకంగా పని చేసిందన్నారు. ఏటీసీ ఉన్నత విద్యకు సమానమని చెప్పారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీలో చేరి, ప్రయోజకులుగా మారి భవిష్యత్తులో స్థిరపడాలని కోరారు. బేసిక్ కోర్స్ ఆన్ సి యన్ సి లెత్ మెషిన్, ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్,బేసిక్ కోర్స్ ఆన్ సి యన్ సి మిలింగ్ మెషిన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్,అవేర్నెస్ కోర్స్ ఆన్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్,జూనియర్ రోబోట్ ఆపరేటర్ & ప్రోగ్రామర్ – ఆర్క్ వెల్డింగ్,బేసిక్ కోర్స్ ఆన్ ఇ విజూనియర్ ప్రోడక్ట్ డిజైర్ యూసింగ్ క్యాడ్ -2డీ అండ్ 3డీ ఫీచర్స్ విభాగాలు ఉంటాయని ప్రిన్సిపల్ బి,హారి కృష్ణ వివరించారు.
ఈ ప్రవేశాల కొరకు ఎస్ఎస్సి చదువుకొని ఉత్తీర్ణులైన వారు, 18 సంవత్సరాలు నిండిన ఆసక్తి గల యువతీ, యువకులు షార్ట్ టర్మ్ కోర్సులు [స్వల్పకాలిక కోర్సుల] కు హాజరు కావాలని కోరారు. అనంతరం కోర్సులకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఆహ్వానితులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజాని బాలమణి , టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, నాయకులు బిజన భాస్కర్, టి మహేష్ ,డి రాజశేఖర్, ట్యూటర్స్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



