Friday, October 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంక్యాన్సర్‌కు ఆధునాతన చికిత్స

క్యాన్సర్‌కు ఆధునాతన చికిత్స

- Advertisement -

ఆర్టికాన్‌-2025 సదస్సు విజయవంతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్యాన్సర్‌ చికిత్సలో వస్తున్న ఆధునాతన పద్ధతులను తెలుసుకునేందుకు ఆర్టికాన్‌ -2025 విజయవంతంగా ఉపయోగపడుతున్నదని నిర్వాహకులు తెలిపారు. భారత రేడియేషన్‌ థెరపిస్టులు మరియు టెక్నాలజిస్టుల సంఘం (ఏఆర్టీటీఐ) వ్యవస్థాపక చైర్మెన్‌ డాక్టర్‌ అప్పర్తి శ్రీధర్‌ తదితరుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ”ఆర్టికాన్‌-2025” వార్షిక సదస్సు కొనసాగుతున్నది. ఈ నెల 14న సదస్సు ముగియనున్నది. ఏఆర్టీటీఐ నిర్వహిస్తున్న 29వ జాతీయ సదస్సు ఇది. సదస్సుకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప, సింధు ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.బాబయ్య శుక్రవారం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఏడాది సదస్సుకు హర్నెస్సింగ్‌ ఎక్స్పర్టైజ్‌ ఇన్‌ రేడియేషన్‌ థెరపీ-ఎన్‌ ఆర్టీటీ పర్స్పెక్టివ్‌ అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశారు. రేడియేషన్‌ థెరపీ, ఆంకాలజీ రంగాల్లో జ్ఞాన పంచకం, సాంకేతిక ఆవిష్కరణలు, దేశ-విదేశాల నిపుణుల మధ్య సహకారం కోసం వేదిక చర్చిస్తున్నది. సదస్సులో దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ప్రతినిధులతో పాటు పదుల సంఖ్యలో అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు. ఇందులో ప్రముఖ ఆస్పత్రుల వైద్య సంచాలకులు, ప్రఖ్యాత ఆంకాలజిస్టులు, మెడికల్‌ ఫిజిసిస్ట్‌లు, రేడియేషన్‌ థెరపీ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు ఉన్నారు. రేడియేషన్‌ ఆంకాలజీ, థెరపీ తాజా అభివృద్ధిపై శాస్త్రీయంగా చర్చలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -