నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గా గ్రామంలో ఏ ఈ ఓ నాందేవ్ గ్రామ రైతులతో కలిసి బుధవారం ప్రత్తి పంట ను క్షేత్రస్థాయి లోకి వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తి పంటలో తెల్ల దోమ, పచ్చ దోమ, పెను బంక రసం పీల్చే పురుగులను గమనించడం జరిగింది. రసం పీల్చే పురుగల ఉదృతిని బట్టి అసె్ఫేట్ ఇమిడక్లోప్రిడ్ 400 గ్రా / ఎకరానికి లేదా ఫ్లోనికామిడ్ డఫెంతిరాన్ 250 గ్రా/ ఎకరానికి , రసాయన మందులు పిచికారీ చేయాలని రైతులకు సూచించడం జరిగింది. పంటలను కాపాడుకోవడానికి రసాయన ఎరువులు వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలని తెలిపారు.
రసాయన ఎరువులు మోతాదులో ఉపయోగించాలని రైతులకు వివరించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పంటలకు అనుకున్న స్థాయిలో వర్షం లేక పోవడంతో కీటకాల అభివృద్ధి ఉధృతి పెరుగిందని సూచించారు. ఈ కార్యక్రమం లొ రైతులు శివాజీ, విజకుమార్, మరియు రాజు తదితరులు పాల్గొన్నారు.
హంగర్గాలో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES