నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు రసాయన ఎరువులు వాడకం గురించి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సోయాబీన్ పంట ప్రస్తుతం 25 నుండి 30 రోజుల దశలో ఉంది. ఇందులో ముఖ్యంగా పచ్చ పురుగు, రసం పీల్చే పురుగు, కాండపు ఈగ గమనించి వీటి నివారణకు ప్రొఫెనోఫోస్ 50EC ఎకరాకు 400ml + వేప నూనె 1500ppm @500ml ఎకరాకు +19.19.19@ 1kg ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని రైతు సోదరులకు సూచించడం జరిగింది.
కాండపు ఈగ ఉదృతి అధికంగా ఉంటే ప్రొఫేనో పాస్ 50EC@400ml ఎకరాకు మరియు లమ్డాసైలోథీన్ 200ml ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. రైతు సోదరులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పురుగు మందులు పిచికారి చేయాలని తెలపడం జరిగింది. రసాయన ఎరువులు తగ్గించి జీవ ఏరువులు, సేంద్రియ ఎరువులు వాడాలి అని సూచించారు. ఈ క్షేత్రస్థాయి సందర్శనలో రైతు సోదరులు రాగోబ శ్రీనివాస్, దొండిబ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఖరీఫ్ పంటలను పరిశీలించిన ఎఈఓ నాగుల్ గావ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES