Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెలలుగా ఏఈఓలకు అందని వేతనాలు.!

నెలలుగా ఏఈఓలకు అందని వేతనాలు.!

- Advertisement -

తప్పని ఆర్థిక ఇబ్బందులు
నవతెలంగాణ – మల్హర్ రావు

వ్యవసాయ రంగంలో రైతులకు సేవలు అందిస్తున్న ఏఈఓలకు కొన్ని నెలలుగా సరిగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో నాలుగు క్లస్టర్లలో నలుగురు ఏఈవోలు ఉన్నారు. తాడిచెర్ల క్లస్టర్ ఏఈఓ రెగ్యులర్గా,కొయ్యుర్, రుద్రారం, పెద్దతూండ్ల క్లస్టర్ల ఏఈఓలు ముగ్గురు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐదు నెలలకు సంబంధించి సుమారు రూ.4 లక్షల మేర వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో పోటీపడుతున్న ప్రపంచంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖలో అధిక దిగుబడులు సాధించేందుకు నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నాయి.

పంట సాగులో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు అవస రమయ్యే సూచనలు, సలహాలు ఏఈవోలు అందిస్తుంటారు. ప్రభుత్వం చేపట్టే సాధారణ పంట నమోదు, డిజిటల్ పంట నమోదు, సబ్సిడీపై విత్తనాల పంపిణీ, రైతు బంధుతో పాటు రైతు బీమా తదితర పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తుంటారు. వీటితోపాటు భారీ వర్షాలతో నష్ట పోయిన పంట వివరాలను సైతం సేకరించి ప్రభు త్వానికి నివేదికలు సమర్పిస్తారు. అయితే వీరికి వేతనాలు సకాలంలో అందక తీవ్ర అవస్థలు పడు తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల చర్యలు తీసుకొని పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి, నెలవారీగా వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -