Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅసోషియేషన్‌ అడ్వర్టైజింగ్‌కు ఏఎఫ్‌ఏఏ ఆవార్డు

అసోషియేషన్‌ అడ్వర్టైజింగ్‌కు ఏఎఫ్‌ఏఏ ఆవార్డు

- Advertisement -

టి-సేఫ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కు జాతీయ గుర్తింపు
ఛేంజ్‌ మేకర్స్‌ ఫర్‌ గుడ్‌ అవార్డు

హైదరాబాద్‌ : అసోసియేటెడ్‌ అడ్వర్టైజింగ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు ఆసియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్టైజింగ్‌ అసోషియేషన్‌ (ఏఎఫ్‌ఏఏ) ద్వారా జాతీయ ప్రభుత్వ విభాగంలో టి-సేఫ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక ఛేంజ్‌ మేకర్స్‌ ఫర్‌ గుడ్‌ అవార్డు లబించింది.తెలంగాణ ప్రభుత్వ మహిళా భద్రత విభాగం కోసం రూపొందించిన టి-సేఫ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కు ఈ పురష్కారం లభించింది. ప్రభావంతమైన ప్రచార కార్యక్రమం ఇప్పుడు బీజింగ్‌లో జరిగే ఏఎఫ్‌ఏఏ అవార్డుల్లో ఈ ప్రచార కార్యక్రమంతో భారత్‌ ప్రాతినిథ్యం వహించనున్నది. అవార్డు గెలుచుకున్న వీడియోలో టి-సేఫ్‌ అనే కీలకమైన రైడ్మానిటరింగ్‌ వీసును ఆధారంగా తీసుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగం అందిస్తున్న సేవ. ప్రచార కథనంలో ఒక మహిళ అర్థరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తూ టి-సేఫ్‌ నెంబర్‌ను ఉపయోగించే సందర్భం చూపించారు. ఆమె కాల్స్‌కు స్పందించకపోయినా, పోలీసులు నిరంతరంగా ఆమె భద్రతపై దృష్టి పెట్టడం హద్యంగా చూపించారు.

ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రజలకు టి-సేఫ్‌ సేవ గురించి అవగాహన కల్పించడం, మహిళలు దైర్యంగా ఈ సేవను వినియోగించుకునేలా ప్రోత్సహించడం, రాత్రి సమయంలో మహిళలకు భద్రతగా ఉండే పరిసరరాలను ఏర్పరచడంలో సహకరించడమే. ఈ వీడియో నిర్మాణానికి గ్రోద్రేజ్‌ జెర్సీ, ప్రీడం హెల్దీకుకింగ్‌ అయిల్‌ స్పాన్సర్‌గా మద్దతు ఇచ్చాయి. అసోషియేషన్‌ అడ్వర్టైజింగ్‌ భారత దేశంలోని ప్రాచీన స్వతంత్ర ప్రకటన సంస్థ. ఇది ప్రధాన మీడియా ప్రకటనలు, డిజిటల్‌ మార్కెటింగ్‌, మీడియా ప్లానింగ్‌, క్రియేషన్స్‌, టెక్‌ ఇన్నోవేషన్‌, అనిమేషన్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ వంటి విభాగాల్లో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నది. మానవతామార్పును కలిగించే ప్రచారాలు రూపొందించి, క్లైయింట్లకు కొలతలతో కూడిన ఫలితాలు అందించడంలో సంస్థ కృషి చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్లను విజయవంతంగా స్థాపించడంలో సంస్థ నిరంతర గుర్తింపు పొందుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -