Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

బాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం నిజాంపేట మామిడిపల్లి సమీపంలో వడగండ్లవానతో 217 మేకలు మృత్యువాతపడ్డాయని తెలిపారు. వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి చనిపోయారని పేర్కొన్నారు.

మంచిర్యాల, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, అనేక జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వడగండ్లవానతో మామిడి, కూరగాయలు, మొక్కజొన్న, వరి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొక్కజొన్న, పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. పదివేలకు పైగా ఎకరాల్లో మిర్చి, మామిడి పుచ్చకాయ, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన రైతులకు, మేకలకాపరికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -