- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1400 మంది మరణించినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. మరో 3వేల మంది గాయపడినట్లు తెలిపారు. ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. భూకంపం ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల ఆర్తనాదాలు వర్ణనాతీతం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -