Monday, December 22, 2025
E-PAPER
Homeఆటలుఐదు జట్లతో అఫ్ఘాన్‌ టీ20 లీగ్‌

ఐదు జట్లతో అఫ్ఘాన్‌ టీ20 లీగ్‌

- Advertisement -

2026 అక్టోబర్‌లో షెడ్యూల్‌!

దుబాయ్ : ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు అఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) సైతం టీ20 లీగ్‌ నిర్వహణకు సై అంటోంది. ఐదు ప్రాంఛైజీలతో టీ20 లీగ్‌కు రూపకల్పన చేస్తున్న అఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. 2026 అక్టోబర్‌లో కొత్త లీగ్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది. అఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు 2018లోనే అఫ్ఘనిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)ను ప్రకటించి, ఓ సీజన్‌ను నిర్వహించింది. క్రిస్‌ గేల్‌, షాహిద్‌ అఫ్రిది, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ వంటి మేటి క్రికెటర్లు ఏపీఎల్‌లో ఆడారు. కానీ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వటంలో నిర్వాహకులు విఫలం అయ్యారు. లీగ్‌ సమగ్రతపైనే నీలినీడలు రావటంతో ఏపీఎల్‌ అర్థాంతరంగా నిలిచింది. 2026 జూన్‌-జులైలో ఏపీఎల్‌ పేరుతో ప్రాంఛైజీలు, ఆటగాళ్ల ముసాయిదా సిద్ధం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -