రెండో అవకాశం ఇచ్చే జీవితంలో ఏడేసి వర్ణాల కలయికలని తలదన్నే అనుభవాలే వుంటాయి. అవి భరించలేని స్వర్గమో, నరకమో, రెండిటికీ మధ్య ఇంకేదో తెలియని లోకాన్నో చూపిస్తాయి. రూన్సీ గారి ఆత్మచరిత్రాత్మక నవలలో ఈ మలుపులన్నీ కనిపిస్తాయి. అందులోనూ (ప్రవాస జీవితంతో ముడిపడిన అనుభవాల నేపథ్యంలో ఇవన్నీ అనిర్వచనీయమైన పరిమళంతో జరీ అంచుతో మెరుస్తాయి. ఒక నిండైన అనుభవాన్ని ఊహతోనో, అందమైన ప భావనలతోనో స్నేహం కలిపి మాట్లాడించటం అంత తేలికేమీ కాదు, అది ఆ జీవన అనుభూతిని అనుభవిస్తున్నప్పటి కత్తి మీద సాము. అందులో మధురమైన విషాదం, దుఃఖానందం – అనేక విరోధాభాసల సమ్మేళనం. ఈ నవలలోనే ర్ఫూన్సీ గారు ఒక చోట అంటారు – ప్రతి వాక్యం తన ప్రతిబింబమే అని! సాహిత్యాన్ని తన ప్రతిబింబంగా మలచుకునే తాత్వికతలోనే చాలా పెయిన్ వుంది.
అలాంటప్పుడు ఆ రచయిత తన జీవితమే చట్రంగా ఒక రచనని సృష్టించినప్పుడు అది రేజర్స్ ఎడ్జ్ అవుతుంది. ఒక రచయిత్రిగా ర్ఫూసన్సీ గారికి ఇప్పుడేమీ కొత్త పరిచయం అక్కర్లేదు. ఆమె మనోప్రపంచం వివిధ ప్రక్రియలుగా మనకి తెలుసు. సాహిత్యం ఆమెకి కేవలం ఒక ఆసరా కాదు, తనకెంతో ప్రియమైన ప్రపంచంలో వుంటూనే తన కోసం తాను క్రియేట్ చేసుకున్న సమాంతర ద్వీపం. ఆ ద్వీపం మన ఊహలకందని అనేక కడలి కెరటాల మధ్య తానుగా నిలిచే ఇండిపెండెంట్ రియల్మ్ ఈ నవల చదివాక అది మరోసారి మీకు రుజువవుతుంది. ఈ నవలలో ఒక సాంప్రదాయికత నుంచి కాస్మోపాలిటన్ లోకం వైపు కొత్త వర్ణమాల వెతుక్కునే ఝాన్సీ గారిని మీరు చూస్తారు. ఆ రకంగా ఈ నవల మీకొక కొత్త పరిచయమే. వినూత్న అనుభవ విపంచికే! చదివి అనుభవించి పలవరించడమే కాదు, జీవితమిచ్చే అవకాశాల ఆకాశ పరిమితిని పునరాలోచించుకునే సందర్భమే!
- అఫ్సర్



