– సాకర్ లెజెండ్‌కు జయేశ్ రంజన్ సంతాపం
హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రఖ్యాత హైదరాబాదీ ఆటగాడు డిఎంకె అఫ్జల్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) ఉన్నతాధికారులు, కోచ్‌లు సంతాపం వ్యక్తం చేశారు. 1962 ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు బంగారు పతకం సాధించటంలో అఫ్జల్ కీలక పాత్ర పోషించాడు. భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంలో వెలుగొందిన అఫ్జల్.. హైదరాబాద్‌లో సాకర్ అభివృద్దికి సైతం విశేష సేవలు అందించారని, ఆయన మరణం ఫుట్‌బాల్‌కు తీరని లోటు అని జయేశ్ రంజన్ తన సంతాప సందేశంలో తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అఫ్టల్‌కు శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం సైతం అందజేసిన విషయాన్ని శాట్జ్ అధికారులు గుర్తు చేశారు.
ఫుట్‌బాల్‌కు అఫ్జల్ సేవలు అసమానం
- Advertisement -
- Advertisement -