పెద్ద ఏడ్గీ సెక్టార్ ఏఈఓ సులోచన..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులను ఏఈఓ సులోచన బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ యజమానులకు పలు సూచనలు చేశారు. యూరియాను కృత్రిమంగా కొరత సృష్టిస్తే శాఖపరమైన చర్యలతో పాటు ఏజెన్సీ లైసెన్సులు రద్దు చేయబడతాయని సూచించారు. అదేవిధంగా దుకాణాలలో మందుల పట్టికను డిస్ప్లే చేయాలని వాటి గడువు తేదీలను కూడా అందులో పట్టిక పైన వ్రాయాలని తెలిపారు.
మహారాష్ట్ర , కర్ణాటక నుండి ఎరువులను తెచ్చి తెలంగాణలో అమ్మితే కఠినంగా శిక్షలు ఉంటాయని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఏ రైతు అయినా మందులు కొనుక్కుంటే తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని దుకాణ యజమానులకు ఆదేశించారు. మందులను ఎక్కువ రేట్లు తీసుకొని రైతులకు అమ్మకూడదని ఒకవేళ అమ్మినట్టు మా దృష్టిలో వస్తే రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయవద్దని తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెక్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు సూచించారు. ఏది కొన్న ప్రతిదానికి రసీదు తప్పక తీసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఏఈఓ సులోచన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే ఏజెన్సీల లైసెన్సులు రద్దు అవుతాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES