నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్ ) కార్యక్రమాల భాగంగా, ఏ జి ఐ గ్రీన్ప్యాక్ లిమిటెడ్ భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలకు చెందిన రాగ్ పికర్లకు ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ ఆటోలు) అందజేసి వారి జీవనోపాధికి మద్దతు అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం వారి ఆదాయ అవకాశాలను పెంచడంతో పాటు, పట్టణంలో శుభ్రత, స్థిరమైన వ్యర్థ నిర్వహణను ప్రోత్సహించడం తమ లక్ష్యం అన్నారు.
ఈ ఈవీ ఆటోలను తుక్కాపూర్లోని ఏ జి ఐ సి ఎస్ ఆర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాగ్ పికర్ గ్రూపులకు అధికారికంగా అందజేశారు. ఈ వాహనాలను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్రూపులు వినియోగించుకోనున్నారు. దీని ద్వారా పర్యావరణం మరింత శుభ్రంగా మారడమే కాకుండా, ప్రజా ప్రదేశాలు మరింత సురక్షితంగా మారనున్నాయి. ఈ కార్యక్రమంలో విపి గోవింద్ జీ రాయ్, ఏవిపి మయాంక్, సీనియర్ జనరల్ మేనేజర్ శివరాం, అడిషనల్ జనరల్ మేనేజర్ చైతన్య, సెక్యూరిటీ ఏజిఎం జోగిరెడ్డి, సి ఎస్ ఆర్ కోఆర్డినేటర్లు క్రాంతి, కళ్యాణ్, రెండు రాగ్ పికర్ గ్రూపుల ప్రతినిధులు హాజరయ్యారు.



