Wednesday, July 30, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో ఎజిలెంట్‌ బయోఫార్మా సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌లో ఎజిలెంట్‌ బయోఫార్మా సెంటర్‌ ఏర్పాటు

- Advertisement -

హైదరాబాద్‌ : లైఫ్‌ సైన్సెస్‌, డయాగస్టిక్స్‌ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఎజిలెంట్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌లో తమ కొత్త బయోఫార్మా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎజిలెంట్‌ సిఇఒ ప్రాడ్రైగ్‌ మెక్‌డొనెల్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో భారీ పెట్టుబడులకు నిదర్శనమని మెక్‌డొనెల్‌ పేర్కొన్నారు. ఔషధ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడం, అధిక నాణ్యత గల ఔషధాలను సమర్థవంతంగా అందించడంపై ఈ సెంటర్‌ దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -