Wednesday, January 7, 2026
E-PAPER
Homeఖమ్మంప్రారంభమైన అగ్రి స్పోర్ట్స్ మీట్ 

ప్రారంభమైన అగ్రి స్పోర్ట్స్ మీట్ 

- Advertisement -

– ఉత్సాహంగా విద్యార్థుల పోటీలు
– మొదటి రోజు విజేతలు ప్రకటన
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రి స్పోర్ట్స్ మీట్ – 2026 అంతర్‌కళాశాల విద్యార్థుల క్రీడా పోటీలు శనివారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజు నుంచే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. మొదటి రోజు క్రికెట్,వాలీబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించగా, వివిధ కళాశాలల జట్లు పోటీపడి విజయాలు సాధించాయి.

క్రికెట్ లో..
బాలురు విభాగం:
అశ్వారావుపేట – సిరిసిల్ల మధ్య జరిగిన పోటీలో సిరిసిల్ల విజయం సాధించింది.
ఆదిలాబాద్ – సంగారెడ్డి తలపడగా సంగారెడ్డి విజేతగా నిలిచింది.

బాలికల విభాగం:
రాజేంద్రనగర్ – అశ్వారావుపేట మధ్య జరిగిన మ్యాచ్‌ లో రాజేంద్రనగర్ గెలుపొందింది.
పాలెం – జగిత్యాల పోటీలో జగిత్యాల విజయం సాధించింది.

వాలీబాల్

బాలురు విభాగం:
అశ్వారావుపేట – వరంగల్ మ్యాచ్‌ లో అశ్వారావుపేట గెలుపొందింది.

బాలికల విభాగం:
అశ్వారావుపేట – రుద్రూర్ పోటీలో అశ్వారావుపేట విజయం సాధించింది.
వరంగల్ – జగిత్యాల మధ్య జరిగిన మ్యాచ్‌ లో జగిత్యాల గెలిచింది.
సిరిసిల్ల – పాలెం పోటీలో సిరిసిల్ల విజేతగా నిలిచింది.

టెన్నికాయిట్..
సిరిసిల్ల – సంగారెడ్డి పోటీలో సిరిసిల్ల విజయం సాధించింది.
రాజేంద్రనగర్ – పాలెం మ్యాచ్‌ లో రాజేంద్రనగర్ విజేతగా నిలిచింది.
అగ్రి స్పోర్ట్స్ మీట్‌ లో మిగిలిన రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించనుండగా, విద్యార్థుల మధ్య క్రీడా స్ఫూర్తి మరింతగా వెల్లివిరుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -