- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల – 2023 బ్యాచ్ మూడవ సంవత్సర వ్యవసాయ విద్యార్థులు రెండో రోజు సోమవారం తమిళనాడు లోని ఊటీలో పర్యటించారు. ఈ నెల నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు పది రోజులు పాటు ఈ విజ్ఞాన యాత్ర సాగుతుంది. తమిళనాడు ఊటి లోని చాక్లేట్,టీ పొడి తయారి పరిశ్రమ,బొటానికల్ గార్డెన్ సందర్శించారు.విద్యార్ధులు నిర్వహించే ఈ యాత్ర కు టూర్ లీడర్ లు కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ కే.శిరీష,డాక్టర్ టి.శ్రావణ కుమార్, డాక్టర్ ఎ. శ్రీ జన్,కే.స్రవంతి వ్యవహరిస్తున్నారు.
- Advertisement -



