Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా రైతులకు రాయితీలో వ్యవసాయ పనిముట్లు: ఏఓ పూర్ణిమ

మహిళా రైతులకు రాయితీలో వ్యవసాయ పనిముట్లు: ఏఓ పూర్ణిమ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
వ్యవసాయ యంత్రికరణ పథకం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ ) లో భాగంగా మహిళా రైతులకు 2025-2026 సంవత్సరానికి గాను 50% శాతం రాయితీతో మెత్తం 194 పనిముట్లు కేటాయించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారిని పూర్ణిమ తెలిపారు. బ్యాటరీ స్పైయర్స్ – 125,పవర్ ఆపరేటర్స్ స్పైయర్స్ – 40,కల్టీ వెటర్స్ /కేజీ విల్స్ /డిస్క్ హార్స్ – 10, రోటో వెటర్స్ – 8,విత్తనం, ఎరువులు తీసే మిషన్స్ – 2,బ్రష్ కట్టర్ -3,పవర్ టిల్లర్ -2, పవర్ వీడర్ – 2,వరి గడ్డి కట్టే మిషన్ -2 అందుబాట్లో ఉన్నాయన్నారు.

మహిళా పేరుమీద పట్ట పాసు బుక్కు కలిగిన వారు అర్హులు. భూమి కలిగిన మహిళ రైతులు అప్లికేషన్ ఫారంతో ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్  ట్రాక్టర్ కు సంబంధించిన వస్తువు కొనుగోలు నిమిత్తం ట్రాక్టర్ ఆర్ సి డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో,సంబంధిత పత్రాలు జత చేసి మండల వ్యవసాయ  కార్యాలయంలో సమర్పించాలని వ్యవసాయ అధికారిని పూర్ణిమ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -