Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆటోలో పరిమితికి మించి వ్యవసాయ కూలీల ప్రయాణం

ఆటోలో పరిమితికి మించి వ్యవసాయ కూలీల ప్రయాణం

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండలంలోని వివిధ  గ్రామాలనుండి ఇతర ప్రాంతాలకు వ్యవసాయ నిమిత్తం వందలాది మంది ప్రజలు కూలీల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు. దీని అలుసుగా తీసుకున్న కొంతమంది ఆటో యాజమానూలు పరిమితికి మించి వ్యవసాయ కూలీలను ఎక్కించుకొని అనేక ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల కొంతమంది వికలాంగులు అయ్యారు. మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయి తమ పిల్లలను అనాధలను చేశారు. పరిమితి నుంచి తరలించడం వలన ప్రమాదాలు జరుగుతాయని తెలిసిన అధిక డబ్బుకు ఆశపడి ప్రైవేట్ వాహనాదారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద ధన్వాడ నసనూరు మాన్ దొడ్డి  రాజోలి పెద్ద తాండ్రపాడు గ్రామాల నిత్యంకూలీల నిమిత్తం ఆటోలో ప్రయాణం చేస్తుండగా ఎన్నో ప్రమాదాలు జరిగాయి.  అధికారులు స్పందించి పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -