నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కమ్మర్ పల్లి కార్యాలయంలో చైర్మన్ పాలెపు నర్సయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. సమావేశంలో మార్కెట్ యార్డు ఆవరణలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులు, రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయాల్సిన పరికరాలు, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న, డైరెక్టర్లు మహిపాల్, నవీద్, మధులతశ్రీనివాస్, సంపత్, నవీద్, రంజిత్, బాబన్న, లింగారెడ్డి, రాములు నాయక్, ముత్తెన్న, సూపర్ వైజర్ రాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES