- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో కుంభంపల్లి, గట్టుపల్లి , వల్లెంకుంట గ్రామాల్లో వరి,పత్తి,కూరగాయల పంటలను సోమవారం ఏఓ శ్రీజ, ఏఈఓ అనూషలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూరగాయలు సేంద్రీయంగా పండించాలని సూచించారు.దీంతో నెల సారవంతంగా ఉండటమే కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అకాల వర్షాలతో నెలవాలిన వరి పొలంలో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి ప్రభుత్వ మరమ్మతు ధరకు అమ్ముకోవడానికి వీలుంటుందని తెలిపారు. రైతులకి ఎలాంటి సందేహాలు ఉన్న వారి వారి క్లస్టర్ ఏఈఓలను సంప్రదించాలని కోరారు.
- Advertisement -



