Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్జక్రాన్ పల్లిలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ..

జక్రాన్ పల్లిలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారు చేపట్టిన ” రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు” కార్యక్రమం  జక్రాన్ పల్లి మండల  కేంద్రంలో నిర్వహించారు.  స్థానిక రైతు వేదికలో  జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు నాయకుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యుడు కోటపాటి  నరసింహం నాయుడు పాల్గొని వ్యవసాయదారులు అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాలు, పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకంలో మెలకువలు, పంటల మార్పిడి  వ్యవసాయ రంగంలో వస్తున్న పరిశోధన ఫలాలు అందిపుచ్చుకొని సంవృద్ధిని ఏ విధంగా సాధించాలో వివరించారు. మన జిల్లాలోని తోట భూములు పామాయిల్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి పామాయిల్ సాగు చేస్తూ దానిలో అంతర పంటలు పసుపు, సోయా మరియు మొక్కజొన్న పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు సాయి చరణ్,  శ్రీమతి ప్రశాంతి , మండల వ్యవసాయ అధికారి శ్రీమతి దేవిక , కృషి విజ్ఞాన్ కేంద్రం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు స్థానిక రైతులు, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -