Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ గ్రోత్‌ఇంజిన్‌గా వ్యవసాయ రంగం

తెలంగాణ గ్రోత్‌ఇంజిన్‌గా వ్యవసాయ రంగం

- Advertisement -

దేశానికే ఆయిల్‌ఫామ్‌ హబ్‌గా తెలంగాణ :గ్లోబల్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ గ్రోత్‌ఇంజిన్‌గా వ్యవసాయ రంగం నిలువబోతున్నదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశానికే ఆయిల్‌ఫామ్‌ హబ్‌గా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో గోద్రెజ్‌ కంపెనీ ఎమ్‌డీ రాకేశ్‌స్వామితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆ సంస్థ సీఈఓ సౌగత్‌ నియోగి, ఆయిల్‌ ఫామ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా వెంకటేశ్వరరావు, కార్పొరేట్‌ అఫైర్స్‌ మీషికా నాయర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ…పదిలక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌ సాగే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గ్రీన్‌ కవర్‌గా పామాయిల్‌ సాగు ఉంటుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం పెరిగేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఎకో, డిజిటల్‌ స్మార్ట్‌ దిశగా తెలంగాణ వ్యవసాయ రంగం ప్రయాణిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతు రాజ్యం ఏర్పడిందన్నారు. రెండేండ్లలో రైతు సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని తెలిపారు. అనుబంధ రంగాల ఆర్థిక వ్యవస్థ పరిణామం 34.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందనీ, 2047 నాటికి దాన్ని 400 బిలియన్‌ డాలర్లకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. నీటిపారుదల రంగం విస్తరణ, వైవిధ్యమైన పంటల సాగు, డ్రోన్లు, యాంత్రీకరణ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ను బలోపేతం చేయడం, ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమల విస్తరణ, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల వ్యవస్థలను బలోపేతం చేయడం, వ్యవసాయ స్టార్టప్‌లను బలోపేతం చేయడం, సేంద్రియ పద్ధతుల్లో సాగును ప్రోత్సహించడం వంటి అంశాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించారు. పొలం నుండి మార్కెట్‌ వరకు బలమైన వ్యవస్థలను నిర్మిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -