Tuesday, April 7, 2026
E-PAPER
Homeసినిమాఆ.. సర్‌ప్రైజ్‌ల్లో ఇదొకటి

ఆ.. సర్‌ప్రైజ్‌ల్లో ఇదొకటి

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. కొత్త దర్శకుడు కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్‌, పీఓవీ స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై పవన్‌ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌. మే 1వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్రంలోని మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తిని బ్రూటల్‌ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. జేడి చక్రవర్తి మాట్లాడుతూ, ‘యాక్టర్స్‌ అందరికీ కమల్‌ హాసన్‌ ఒక కొలమానం.

ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్డ్‌ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, చేయబోరు. అయితే ఈ సినిమాలో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్‌ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్‌ ఇందులో చేశాను. ‘ధర్మ’ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. క్యారెక్టర్‌ పరంగా కమల్‌ హాసన్‌ కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు. అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను. కెరీర్‌లో చాలామందికి జయాపజయాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘మనీ’, సత్య, ‘అనగనగా ఒక రోజు’ చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్‌ చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాను పవన్‌ తన భుజాన వేసుకుని మొదలు పెట్టాడు. ఈ సినిమా దిల్‌రాజుకి నచ్చడం అనేది పెద్ద కమర్షియల్‌ కొలబద్ద. కశ్యప్‌ ఖచ్చితంగా చాలా ఇన్నోవేటివ్‌ డైరెక్టర్‌ అవుతాడు. ఈ సినిమాలో చాలా కొత్త రకం కామెడీ ఉంటుంది.

తరుణ్‌ భాస్కర్‌, నేను, భాను ఇలా చాలామంది డైరెక్టర్స్‌ కలిసి పనిచేసిన సినిమా ఇది. చాలా కొత్త రకం హ్యుమర్‌ వున్న సినిమా ఇది. ఆడియన్స్‌ ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయని నేను ముందే చెప్పాను. అందులో ఒక పెద్ద సర్ప్రైజ్‌ జెడి. ఆయన ఓకే చెప్పిన తర్వాత సినిమా స్థాయి ఇంకా పెరిగింది. సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో, మీరు కూడా థియేటర్లలో అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’ అని పవన్‌ సాదినేని చెప్పారు. డైరెక్టర్‌ కశ్యప్‌ మాట్లాడుతూ,”గాయపడ్డ సింహం” అంటే తరుణ్‌ భాస్కర్‌ ఒక్కరే కాదు, ఇంకా ఉన్నారని ముందే చెప్పాను. అది జేడీ తరుణ్‌ భాస్కర్‌ తన బెస్ట్‌ ఇచ్చాడని చాలాసార్లు చెప్పాం. అలాగే జేడి బెస్ట్‌ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో కనిపిస్తాయి’ అని అన్నారు. ప్రొడ్యూసర్‌ భాను కిరణ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ, ‘ జేడీకి థ్యాంక్స్‌. ఆయన ఈ క్యారెక్టర్‌ చేయడం సినిమాకి చాలా అడ్వాంటేజ్‌ అయింది. ఆయన ”సత్య”గా ఎంత పాపులర్‌ అయ్యారో, ”ధర్మ”గా కూడా అంతే పాపులర్‌ అవుతారని నమ్ముతున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -