Friday, November 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా శ్రామిక శక్తిలో 11.7శాతంపై ఏఐ ప్రభావం

అమెరికా శ్రామిక శక్తిలో 11.7శాతంపై ఏఐ ప్రభావం

- Advertisement -

అయితే ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు
మసాచుసెట్స్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌ : అమెరికాలో ప్రస్తుతం కృత్రిమ మేథస్సు (ఏఐ)ను స్వీకరించడం అనేది ప్రధానంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా టెక్నాలజీ ఉద్యోగాల్లో కేంద్రీకృతమై వుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. లేబర్‌ మార్కెట్‌ వేతన విలువలో ఇది 2.2 శాతంగా వుందని పేర్కొంది. ఇప్పటికే అమెరికా శ్రామిక శక్తిలో 11.7శాతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆక్రమించిందని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి) నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. అక్టోబరులో ఈ అధ్యయనాన్ని నిర్వహించగా, బుధవారం నివేదికను ప్రచురించారు.

అమెరికా లేబర్‌ మార్కెట్‌లోని 11.7శాతం మంది కార్మికులకు సంబంధించి మేథోపరమైన ఆలోచనా, అవగాహనా ప్రక్రియలు, అలాగే పాలనాపరమైన విధులు, కర్తవ్యాల వరకు ఎఐ సాంకేతిక సామర్ధ్యాలనేవి విస్తరించి వున్నాయని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని 15.1కోట్ల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే ఎంఐటి, ఓక్‌ రిడ్డ్‌ నేషనల్‌ లేబరేటరీ రూపొందించిన సాధనం ఐస్‌బెర్గ్‌ ఇండెక్స్‌్‌ను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కార్మికుల ఉపాధులపై ఎఐ ప్రభావాలు వంటి వివరాలను సేకరించారు. ఎఐ అమెరికా లేబర్‌ మార్కెట్‌ను ఏ విధంగా మారుస్తోందో ఈ ఇండెక్స్‌ పరిశీలించింది. ప్రధానంగా ఉద్యోగుల శిక్షణలో కోట్లాది డాలర్లను ఖర్చు పెట్టాలనుకునే విధాన రూపకర్తలకు ఈ సమాచారం ఉపయుక్తంగా వుంటుందని సిఎన్‌బిసి పేర్కొంది.

ఉద్యోగాలకు ముప్పేమీ లేదు
అయితే ఎఐ వల్ల ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని అధ్యయనం పేర్కొంది. ఈ సూచికను సామర్ధ్యాలకు సంబంధించిన మ్యాప్‌గా పరిగణించాల్సిందిగా విధాన రూపకర్తలను నివేదిక కోరింది. కంపెనీలు ఎఐని ఏ విధంగా తమ సంస్థల్లో స్వీకరిస్తాయో, కార్మికులు ఏ విధంగా అమలు చేస్తారో అనే అంశాలపై వాస్తవానికి ఈ ప్రభావం ఆధారపడి వుంటుందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే క్రమబద్దీకరణకు సంబంధించిన నిర్ణయాలు, సామాజిక ఆమోదం, మొత్తంగా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా పాత్ర పోషిస్తాయని నివేదిక పునరుద్ఘాటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -