Wednesday, April 8, 2026
E-PAPER
Homeఆటలుషూటింగ్‌ శిక్షణలో ఏఐ

షూటింగ్‌ శిక్షణలో ఏఐ

- Advertisement -

తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘీ

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత శిక్షణతో షూటర్ల ప్రదర్శన విశ్లేషణ, సాంకేతిక లోపాల గుర్తింపు సహా ఫలితాల మెరుగుదల సాధ్యపడుతుందని తెలంగాణ రైఫిల్‌ సంఘం (టిఆర్‌ఏ) అధ్యక్షుడు అమిత్‌ సంఘీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన స్పోర్ట్స్‌ షూటింగ్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ప్రసంగించిన సంఘీ.. టార్గెట్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా తెలంగాణ షూటర్లు సిద్ధమవుతున్నారని తెలిపారు. తెలంగాణలో షూటింగ్‌ క్రీడకు సమగ్ర అవకాశాలతో కూడిన వ్యవస్థను నిర్మించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. నేషనల్‌ రైఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు నారాయణ్‌ సింగ్‌, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, శాట్జ్‌ వీసీ ఎండీ సోనీబాలా దేవి, ఒలింపియన్‌ ఇషా సింగ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -