Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ ఫిర్యాదులకు ఏఐ సేవలు

విద్యుత్‌ ఫిర్యాదులకు ఏఐ సేవలు

- Advertisement -

వాట్సాప్‌ చాట్‌ బాట్‌ సేవలు షురూ
మార్చిలో అందుబాటులోకి
వాయిస్‌ బాట్‌
రూపకల్పన చేస్తున్న టీజీ-ఎస్పీడీసీఎల్‌
ఇక మాన్యువల్‌ విధానానికి స్వస్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో

విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకతను పెంచే దిశగా ఎస్పీడీసీఎల్‌ కీలక అడుగులు వేస్తోంది. ఫిర్యాదుల పరిష్కారానికి సరికొత్త విప్లవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారిత చాట్‌ బాట్‌, వాయిస్‌ బాట్‌ సేవలను డిస్కం రూపకల్పన చేస్తోంది. ప్రయోగాత్మక దశను పూర్తి చేసుకున్న చాట్‌ బాట్‌ సేవలు అందుబాటులోకి రాగా.. వాయిస్‌ బాటు సేవలు మార్చి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది.

1912 నంబర్‌కు స్వస్తి.. చాట్‌ బాట్‌ సేవలు షురూ
చాట్‌ బాట్‌ సేవలను డిస్కం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్‌ బాట్‌ సేవల శిక్షణ ఇంకా కొనసాగుతున్నందున మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తున్నది. గతంలో వినియోగదారులు విద్యుత్‌ సమాచారం, ఫిర్యాదులను 1912 నెంబర్‌ ద్వారా కాల్‌ సెంటర్‌కు తెలియజేసేవారు. ఈ ఫోన్‌ కాల్స్‌ను ఆన్సర్‌ చేసేందుకు సంస్థ ఉద్యోగులు ఉండేవారు. ఇక నుంచి వారి స్థానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేయనున్నది. ఈ సరికొత్త విధానంతో వినియోగదారులు కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినప్పుడు సిబ్బందితో మాట్లాడాల్సిన పని లేకుండా, ఏఐ బాట్‌ నేరుగా బాధితుల మాటలను అర్థం చేసుకుని ఫిర్యాదులను స్వీకరిస్తుంది. మాన్యువల్‌ విధానంలో తలెత్తే జాప్యాన్ని ఇది పూర్తిగా నివారిస్తుందని డిస్కం అంచనా వేస్తుంది.

‘హాయ్‌’ అని మేసేజ్‌ చేస్తే చాలు
విద్యుత్‌ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నెంబర్‌ను సేవ్‌ చేసుకుని ‘హారు’ అని మెసేజ్‌ పంపడం ద్వారా ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్‌ వివరాలు, విద్యుత్‌ సరఫరా స్థితి సమాచారం వంటి వివిధ సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పొందగలుగుతారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్‌ను తమ మొబైల్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవడం ద్వారా విద్యుత్‌ సేవలను మరింత సులభంగా, సురక్షింతంగా వినియోగిం చుకోవచ్చని డిస్కం భావిస్తోంది.

మాన్యువల్‌ విధానానికి స్వస్తి
ఇప్పటి వరకు ఫిర్యాదులను నమోదు చేసేందుకు వినియోగించిన మాన్యువల్‌ విధానానికి తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ స్వస్తి పలకనున్నది. కాల్‌ సెంటర్లలో ఫిర్యాదులు స్వీకరించేందుకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చు కోనున్నది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆ సిబ్బంది స్థానాన్ని భర్తీ చేయనున్నది. వినియోగదారులు తమ మొబైల్‌ ద్వారా వాట్సాప్‌ లేదా వెబ్‌సైట్‌ వేదికగా విద్యుత్‌ కోతలు, బిల్లింగ్‌ తప్పులు, మీటర్‌ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. చాట్‌ బాట్‌ తక్షణమే స్పందించి ఫిర్యాదును నమోదు చేయడమే కాకుండా, అది ఏ దశలో ఉందో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్‌ ఇస్తుంది.

ఆలస్యం ఉండదు.. పారదర్శక సేవలు
24/7 సిబ్బందితో సంబంధం లేకుండా ఏఐకి ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్‌ లైన్లు బిజీగా ఉండటం వంటి సమస్యలు ఉండవు. ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ట్రాకింగ్‌ ఐడీ అందుతుంది. దీంతో పారదర్శకంగా సేవలు అందుతాయి. రాబోయే వేసవి కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉన్నం దున, మానవ వనరుల వినియోగాన్ని ఫిర్యాదుల నమోదు కంటే వాటిని పరిష్కరించే క్షేత్రస్థాయి పనులపై సిబ్బంది ఎక్కువ దృష్టి సారించవచ్చు.

సత్వర విద్యుత్‌ సేవలకు వాట్సాప్‌ చాట్‌ బాట్‌ – ముషారఫ్‌ ఫరూఖీ, సీఎండీ, ఎస్పీడీసీఎల్‌
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ తన వినియోగదారులకు మరింత సమర్థవం తమైన, సులభమైన సేవలందిం చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గిస్తోంది. ఈ దిశగా వినియో గదారులు విద్యుత్‌ సేవలను నేరుగా తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే పొందేలా వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పారదర్శక సేవలు అందడంతోపాటు ఆలస్యానికి కూడా చెక్‌ పెట్టొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -