Monday, April 13, 2026
E-PAPER
Homeబీజినెస్14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో Ai+ స్మార్ట్‌ఫోన్ నోవా 2 అమ్మకాలు ప్రారంభం

14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో Ai+ స్మార్ట్‌ఫోన్ నోవా 2 అమ్మకాలు ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కొత్తగా ప్రారంభించిన నోవా సిరీస్‌లో భాగంగా తమ సరికొత్త డివైస్‌ ‘నోవా 2’ విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్‌ఫోన్‌ ప్రకటించింది. రోజువారీ ఉపయోగంలో విశ్వసనీయత, వ్యక్తిగత శైలి ప్రతిబింబించేలా రూపొందించిన నోవా 2, ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

Ai+ నోవా 2 ధరలు ఈ విధంగా ఉంటాయి:

4జీబీ + 64 జీబీ | ₹8,999
6 జీబీ + 128 జీబీ | ₹10,999

“అందుబాటులో నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి రూపొందించిన టెక్నాలజీకి Ai+ నోవా సిరీస్ అత్యంత బలమైన ప్రతిబింబం. మొదటిసారి అప్‌గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులు రాజీపడకుండా వారికి అవసరమైనవన్నీ అందేలా నోవా 2 చూస్తుంది. ఏప్రిల్ 14న అమ్మకాలు ప్రారంభించి మరింత మంది వినియోగదారులను Ai+ పరిధిలోకి తీసుకురావాలని మేము ఉత్సాహంగా ఉన్నాము,” అని Ai+ స్మార్ట్‌ఫోన్ సీఈఓ, నెక్స్ట్‌ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్‌ అన్నారు.

రోజంతా పనిచేసే శక్తి
6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2 రోజంతా స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సరిపోయేలా రూపొందించబడింది. ఇది నెక్ట్స్‌క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16 పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేయబడిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్‌తో కూడిన 6.745-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వినియోగదారులు కంటెంట్‌ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్‌, నిరంతరాయమైన స్క్రోలింగ్‌ అందిస్తుంది.

రోజువారీ వినియోగానికి తగిన కెమెరా, డిజైన్ నిర్మాణం
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్‌ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది ఐదు విభిన్న రంగులు- పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్ల్యాక్లో లభిస్తుంది —ప్రతి ఒక్కటీ ఒక విభిన్న శైలిని ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -