Sunday, October 19, 2025
E-PAPER
Homeజోష్చిన్ననాటి కష్టాన్ని తీర్చిన ఎఐ

చిన్ననాటి కష్టాన్ని తీర్చిన ఎఐ

- Advertisement -

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. ప్రస్తుతం అన్ని రంగాల్లో అనివార్యం అయిపోయింది. విద్యా, వైద్య, రవాణ ఇలా రోజువారి మనం ఉపయోగించే వస్తువుల్లో ఏఐ మిళితమైపోయింది. ఈక్రమం లోనే ఇత్యాది టెక్నాలజీని ఉపయోగించి తన చిన్ననాటి కష్టానికి చరమగీతం పాడాడు ఓ యువకుడు. ఇప్పుడా ఆ యువకుడు కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణతో తన చిన్ననాటి కష్టాన్నే కాదు…చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరి కష్టాలను తీర్చాడు. ఆ సరికొత్త ఆవిష్కరణ గురించే నేటి జోష్‌ కథనం.

ఇప్పుడు ఉన్న తరంతో పోల్చుకుంటే.. 90లకు చెందిన తరానికి చాలా తేడా వుంటుంది. పద్ధతులు, ఆలోచన నుంచి మొదలు ఆటలు వంటి అంశాల్లో ఎన్నో వ్యత్యాసాలు మనం నిత్యం గమనిస్తుంటాం. ప్రస్తుత జనరేషన్‌ పిల్లలు హాయిగా ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లతో ఎక్కవగా టైం పాస్‌ చేస్తుంటారు. అవుట్‌ డోర్‌ ఆటలు ఆడడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. కానీ 90ల జనరేషన్‌ ఎక్కువగా ఆవుటో డోర్‌ ఆటలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి కోవకు చెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివం మౌర్యకు సైక్లింగ్‌ అంటే మహా ఇష్టం. కానీ అతను స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఎత్తైయిన ప్రదేశాలకు తన సైకిల్‌ తొక్కుతూ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఆ ఎత్తైయిన రోడ్డు మార్గాన్ని దాటేసరికి అతని శక్తి అంతా నశించిపోయేంది. ఇదే తంతు రోజు జరుగుతునే ఉండేది. కొన్ని సార్లు ఆ ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహించ లేక స్కూల్‌కు డుమ్మకొట్టిన సందర్భాలు అనేకం. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కొనుగోనాలే ఉద్దేశ్యంతో మౌర్య తన బుర్రకు పదును పెట్టాడు.
ఆ తర్వాత పదో తరగతి పాసైన మౌర్య.. తన స్నేహితులాగా ఇంటర్‌ చేయకుండా పరిశోధనలకు దోహదం చేసే డిప్లమా కోర్సుల వైపు అడుగుల వేశాడు. బీ.టెక్‌ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే అనేక పరిశోధనలు చేసి విఫలమైయ్యాడు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ కొంత మొత్తంలో డబ్బులు సంపాదించాడు. ఆ నగదుతో కొన్ని మోటార్‌ పరికరాలు కొని తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈక్రమంలోనే వినూత్నమైన మోటార్‌ సైకిల్‌ తయారు చేసి సోషల్‌ మీడియా య్యూట్యూట్‌ లో పోస్టు చేశాడు. దీంతో అనతికాలంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. అధిక వ్యూస్‌ వచ్చినందుకు య్యూట్యూట్‌ ద్వారా రూ.48వేలు ఆదాయం అతను పొందాడు. ఆవిధంగా తన సంపాందించిన మొత్తాన్ని తన చిన్ననాటి కష్టాన్ని తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా సష్టించిన నార్మల్‌ మోటర్‌ సైకిల్‌కు పలు మెరుగులు దిద్ది.. ఎ.ఐ. సాంకేతికతతో ఓ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
తను తయారు చేసి య్యూట్యూట్‌ లో పోస్టు చేసిన మోటార్‌ సైకిల్‌కు ఆధునాతన పరికరాలు వినియోగించి ఎలక్ట్రానిక్‌ ఏఐ మోటరా బైక్‌ కనిపెట్టాడు. ఈ ఏఐ సూపర్‌ బైక్‌తో ఎంతటి ఎత్తైన ప్రదేశానైనా సునాయాసంగా అధిరోహించొచ్చు. దీంతో ఏఐ సూపర్‌ బైక్‌తో చిన్ననాటి కష్టాన్నే కాకుండా సకల జనలు కష్టాలను తీర్చాడు. ఆ ఏఐ బైక్‌ కు ‘గరుడ’ అనే పేరు పెట్టాడు. గరుడా బైక్‌ను తయారు చేయడానికి అతనికి మొత్తం లక్షాఎనబైవేలు ఖర్చు అయ్యాయి.



బైక్‌ ఉన్న బ్యాటరీ పవర్‌ ఏకధాటిగా 200 కిలోమీటర్ల వరకు గరుడా బైక్‌ మీద ప్రయాణించొచ్చు. అంతేకాకుండా ప్రయాణ సమయంలో అనుకోకుండా ఎదురై అవరోధాలను ముందే సదురు బైక్‌ కు ఉన్న అత్యాధునిక సెన్సర్లు పసిగడుతాయి. రోడ్డు మార్గంలోని ఎత్తుపల్లాలను కెమెరాల ద్వారా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా జీపీఎస్‌ నావిగేషన్‌, వైర్‌లేస్‌ చార్జీంగ్‌, కాలింగ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ పామ్‌లను కూడా బైక్‌ డిసిప్లే పై ఇన్‌స్టాల్‌ కూడా చేయొచ్చు. ఈ ఏఐ సూపర్‌ గరుడా బైక్‌..సాధారణంగా డ్రైవింగ్‌ తోపాటు ఫోన్‌ ద్వారా కూడా కంట్రోల్‌ చేయొచ్చు.
తన పరిశోధనల్లో భాగంగా అనేక సార్లు విఫలం చెందానని, దీంతో కొంతమంది తనను హేళన చేసినా..కుంగిపోకుండా తన పరిశోధనలను ముమ్మరం చేశాడు. వారి హేళనలు.. అతనిని పరిశోధనలపై దష్టి సారించే విధంగా కషి చేశాయి. మొదట్లో తన ప్రయత్నాల్లో కనిపెట్టిన పలు పరిశోధనలను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసేవాడు. తద్వారా వచ్చే నగదుతో తన పరిశోధనలకు ఖర్చు చేశాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్న చిన్న పనులు చేస్తూ స్వయం కషితో ఎదిగాడు మౌర్య.

దామచర్ల ఉపేందర్‌, 7093937730

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -