Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐ టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కోవాలి

ఏఐ టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కోవాలి

- Advertisement -

స్టాన్లీ మహిళా కాలేజీ సదస్సులో సోనాలి సిర్పూర్‌కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయని యూపీ స్కిల్‌ వ్యవస్థాపకులు సోనాలి సిర్పూర్‌కర్‌ అన్నారు. వాటి నుంచి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ‘కృత్రిమ మేధ మనిషి బాధ్యత, కర్తవ్యాలు’అనే అంశంపై రెండురోజుల సదస్సు గురువారం హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్‌ (అటానమస్‌)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోనాలి సిర్పూర్‌కర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో వేగంగా మారుతున్నదని చెప్పారు.

విద్యార్థులు విజయం సాధించాలంటే సహన శక్తి చాలా అవసరమనీ, ప్రాజెక్ట్‌ ఫెయిల్యూర్‌, బక్స్‌, డెడ్లైన్స్‌, పోటీ వంటి సవాళ్లు తప్పవని అన్నారు. వాటికి భయపడకుండా వాటి నుంచి పరిష్కారాలను కనుక్కుని ముందుకు సాగాలని సూచించారు. ప్రతి సమస్యనూ ఒక అవకాశంగా తీసుకోవాలని కోరారు. కంప్యూటర్‌ కెరీర్‌లో నాయకత్వ లక్షణాలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. నాయకత్వమంటే పదవి కాదనీ, బాధ్యత అని అన్నారు. విద్యార్థులు నిరంతర అభ్యాసం, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు వస్తాయనీ, కానీ నాయకత్వ లక్షణాలు భవిష్యత్‌ను నిర్మిస్తాయని వివరించారు.

రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశుతోష్‌ ఝా మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలు జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఈ అభివృద్ధి మధ్యలో నైతిక విలువలు, విశ్వాసం అత్యంత కీలకమైనవని చెప్పారు. ఏసీఎంబీడబ్ల్యూ పిఆర్‌ అనీషా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కుశాల్‌ శ్రీవాస్తవ, కేపీఎంజీబీ ఇండియా సైబర్‌ సెక్యూరిటీ అసోసియేట్‌ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ దుర్భా, స్టాన్లీ మహిళా కళాశాల సెక్రెటరీ, కరెస్పాండెంట్‌ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేశ్‌రెడ్డి, ఆర్‌ ప్రదీప్‌రెడ్డి, డీన్‌ ప్రొఫెసర్‌ ఏ వినయ్ బాబు, ప్రిన్సిపాల్‌ బిఎల్‌ రాజు, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -