– అవుట్‌సోర్సింగ్‌పై నీలినీడలు
బెంగళూరు : భారత విదేశీ మారకంలో అత్యంత కీలక పాత్ర పోశిస్తోన్న 300 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటి రంగం కృత్రిమ మేధా (ఏఐ) రూపంలో పెను సవాల్‌ను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ ఐటీ సేవలపై ఎక్కువ ఒత్తిడి నెలకొందని రిపోర్టులు వస్తోన్నాయి. డేటా ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్ వంటి సంప్రదాయ పనులను ఏఐ టూల్స్ వేగంగా ఆటోమేట్ చేస్తుండటంతో, ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీని ప్రభావంతో ఈ ఏడాది ఐటీ స్టాక్స్ 20 శాతం వరకు పతనమయ్యాయి. 2030 నాటికి ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో దాదాపు 50 శాతం కోత పడవచ్చని ఆ రంగం విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జెఫరీస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఐటి కంపెనీల ఆదాయ వృద్ధి రాబోయే ఐదేళ్లలో మందగించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నాయి. కాగా మరోవైపు ఈ సంక్షోభాన్ని కొత్త అవకాశంగా మార్చుకోవచ్చని పరిశ్రమ దిగ్గజాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వంటి నేతలు అభిప్రాయపడుతున్నట్టుగా, ఏఐ వల్ల పాత పద్ధతులు మారినప్పటికీ, క్లయింట్లు తమ వ్యవస్థలను ఆధునీకరించుకోవడానికి ఐటీ కంపెనీల సహాయం కోరడం ఖాయమని పేర్కొన్నారు. ఏఐ టూల్స్ కోడింగ్‌ను వేగవంతం చేసినా, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి, కస్టమైజేషన్‌కు ఇప్పటికీ మానవ మేధస్సు అనివార్యమని భావిస్తున్నారు.
భారత ఐటీకి ఏఐ ముప్పు..
- Advertisement -
- Advertisement -



