మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఖిల భారత స్థాయిలో విస్తత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదలు, కూలీల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఈ జాతీయో ద్యమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించారు. అజరు మాకెన్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో జైరాం రమేష్, సందీప్ దీక్షత్, డాక్టర్ ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, మంత్రి సీతక్క, దీపికా పాండే సింగ్, డాక్టర్ సునీల్ పంవార్, మానిష్ శర్మ సభ్యులుగా ఉన్నారు. సదరు పథకాన్ని బలహీ నపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, గ్రామీణ భారతంలోని కోట్లాది కూలీల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంతో ఈ బచావో సంగ్రామ్ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా సాగనుందని ఏఐసిసి స్పష్టం చేసింది.
ముందు కవిత ప్రశ్నలకు సమాధానమివ్వాలి
ఎవరిని ఉరి తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు : మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రంలో ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పు చెప్పారని టీపీసీసీ అధ్యక్షలు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ఎద్దేవా చేశారు. తెలంగాణను భ్రష్టు పట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్ దేనని ఆయన విమర్శించారు. బీసీల పట్ల చిత్తశుద్ధితో కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చిందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్ అసెంబ్లీ నుంచి పారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
8న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 8న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షలు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన డీసీసీ అధ్యక్షలు, టీపీసీసీ ఉపాధ్యక్షలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్ష నటరాజన్‌లతో పాటు టీపీసీసీ కార్యవర్గం పాల్గొంటారని తెలిపారు. 15లోగా మండల కాంగ్రెస్ అధ్యక్షల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు నిరసన కార్యక్రమాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
ప్రతిపక్షంలో ఉంటేనే ఆంధ్రోళ్ల దోపిడీ అంటారా? : టి.జగ్గారెడ్డి
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆంధ్రోళ్ల దోపిడీ అంటూ రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ హౌదాల్లో ఆయన అధికార పదవుల్లో ఉన్నప్పుడు దోపిడీ గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. ఇందులో మతలబేమిటని ఆయన ప్రశ్నించారు.
జేలులు నింపుకున్న హరీశ్ రావు : చనగాని దయాకర్
ప్రాజెక్టుల పేరుతో మాజీ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు జేబులు నింపుకున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ, పాలమూరు జిల్లాల రైతుల ద్రోహి హరీశ్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్ర ఆధిపత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
కేటీఆర్ అసహనం తగ్గించుకోవాలి : ఆది శ్రీనివాస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం తగ్గించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం 10 ఏండ్లు చేసిన అవి నీతిని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎండగడుతుంటే అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కేటీఆర్ పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేగా పరిరక్షణకు ఏఐసీసీ సమన్వయ కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



