– హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల కార్యక్రమాలు
– ప్రారంభించనున్న సినీ నటి రోహిణి
– హాజరుకానున్న జాతీయ నాయకులు
– 26 రాష్ట్రాల నుంచి 850మంది ప్రతినిధుల రాక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుంది. జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర రామన్ మహాసభల ఏర్పాట్లు, ఎజెండా తదితర వివరాలను వెల్లడించారు. గత మూడేండ్లలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, వాటిపై ఐద్వా చేసిన పోరాటా లను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందిం చుకోనున్నట్టు తెలిపారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు మోడీ సర్కార్ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. మహాసభల రిసెప్షన్ కమిటీ చైర్ పర్సన్‌గా మెగాసెసె అవార్డు గ్రహీత శాంతాసిన్హా ఉన్నారని తెలిపారు. మహాసభలను మహిళా యాక్టివిస్ట్, సినీ నటి రోహిణి ప్రారంభిస్తారని తెలిపారు. సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించి, మనువాదాన్ని తిప్పికొట్టి, మహిళల హక్కుల కోసం ముందుకు సాగుదాం అనే పిలుపుతో మహాసభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభల తొలిరోజు వేలాది మందితో ర్యాలీ, బహిరంగ సభ నిర్వ హించనున్నట్టు చెప్పారు. సర్ పేరుతో బీహార్‌లో ఎన్నిక లకు ముందు 65లక్షల మంది ఓట్లను తొలగిస్తే, అందు లో 47 లక్షల మంది మహిళలే బాధితులుగా మారారని తెలిపారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లా డుతూ వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమ స్యలపై మహాసభల సందర్భంగా సదస్సులు నిర్వహించ నున్నట్టు తెలిపారు. మహాసభలకు ఐద్వా ఆలిండియా ఫ్యాట్రన్ బృందాకారత్‌తో పాటు అధ్యక్ష, కార్యదర్శి టీచర్, దావలే, కోశాధికారి ఎన్.పుణ్యవతి, ఉపాధ్యక్షురాలు సుధా సుందర రామన్ లతో పాటు అనేక మంది నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి, రూపొం దించబోయే భవిష్యత్ కార్యాచరణ మహిళా ఉద్యమాలకు దిశానిర్దేశం చేయనున్నదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రేయోభిలాషులు, పెద్దలు, ప్రజలు ఆర్థిక, హార్థిక సహాయ, సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి, సహాయ కార్యదర్శులు కె.ఎన్.ఆశాలత, బి.సరళ, కె.నాగలక్ష్మి, పి.ప్రభావతి, ఎం.భారతి, ఎండీ షబానా బేగం పాల్గొన్నారు.
జనవరి 25 నుంచి ఐద్వా 14వ జాతీయ మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



