నవతెలంగాణ – కంఠేశ్వర్ : మహిళలపై పెరుగుతున్న హింస నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో హింసకు గురై అడ్మిట్ అయిన మహిళను ఐద్వా నాయకులు గురువారం పరామర్శించారు. వినాయక్ నగర్ నివాసి బి లక్ష్మినీ భర్త తడిక శ్రీకాంత్ అత్త శోభ, మరిది హరికాంత్,లు విపరీతంగా కొట్టి పడేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ వాసులు లక్ష్మి తల్లికి ఫోన్ చేసి మీ కూతురు స్పృహ కోల్పోయి పడిపోయింది అని అని లక్ష్మి తల్లి చెప్పారు. ఐద్వా నాయకులతో లక్ష్మీ మాట్లాడుతూ.. తన భర్త శ్రీకాంత్ తో వివాహం జరిగి 8 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నానని, తనకి మహిళలపై వ్యామోహం ఎక్కువ. పెళ్లిళ్లు చేసుకుంటూ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాపురం చేసి ఆ తర్వాత చిత్రహింసకు గురిచేసి, వారంతర వారే వెళ్ళిపోయే విధంగా అత్త మరిది మొగుడు ప్రవర్తిస్తారని, ప్రతి చిన్న విషయంలో మరిది కలగచేసుకుని మొగుడి కంటే ముందు తానే బూతులు మాట్లాడుతూ.. చేయి చేస్తాడు. అందుకు పూర్తి మద్దతు భర్త అత్త మరిదికే సపోర్ట్ చేస్తారు. అలాగే ఇంట్లో దాదాపు 8 కెమెరాలు చుట్టూ ఉన్నాయని తెలిపింది. రోడ్డుపై నుంచి బెడ్ రూమ్లో కూడా కవరయ్యే విధంగా ఆ కెమెరాలు ఉన్నాయని, తన ఇంటికి ఏ చుట్టాలు వచ్చి అనుమానిస్తూ తనపై నిందలు వేస్తాడని తెలిపారు. దాదాపు 8 సంవత్సరాలుగా ఇదే నరకం చూపిస్తున్నారని, సొంత తమ్ముడు ఇంటికి వచ్చిన అక్రమ సంబంధం అంట కడుతూ తను ఎక్కడికైనా మార్కెట్ కి వెళ్లి వచ్చిన ఇంట్లోకి రాగానే బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి బాడీ మొత్తం చెక్ చేస్తారు. ఎవరితో పడుకొని వచ్చావో చెప్పు అంటూ కొట్టడం స్టార్ట్ చేస్తాడని, ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో 5 అబార్షన్లు చేపించి, ఒక రకమైన హింసకు గురి చేశాడని తెలిపింది. ఈ ఇద్దరు పిల్లలు కూడా లక్ష్మీ తల్లి అమ్మాయి అనారోగ్య పాలవుతున్నది కాబట్టి మీరు అబార్షన్ చేయించడం కరెక్ట్ కాదు అని వాదించడం వల్లనే ఇద్దరు పిల్లలు పుట్టారని, ఒకవేళ పిల్లలు వద్దు అని అంటే ఇష్టం లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా అని చెప్పితే, నువ్వు ఎవరితో ఉంటున్నావో నాకు ఎలా తెలుస్తది. కాబట్టి నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకూడదు అని ఆంక్షలు పెట్టి హింసించేవాడని తెలిపింది.
అలాగే కిరణ్ మై మెడికల్ ఏజెన్సీ కి కూడా తన దగ్గర నుండి 5 లక్షల రూపాయలు రెండు తులాల బంగారం ఏజెన్సీ కి పెట్టాడు అని అయితే శ్రీకాంత్ కి తనకంటే ముందు మూడు వివాహాలు జరిగినట్టు లక్ష్మీ చెప్పింది. అందులో మొదటి భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందని మరో ఇద్దరు విడాకులు ఇచ్చి వెళ్లిపోయారని ఇప్పుడు ఈమెను కూడా ఏదో రకంగా వదిలించుకోవడం కోసమే ఇదంతా కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలంలోనే ఇంకో కొత్త అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉంటూ ఈమెపై ఇంకా కక్ష పెంచుకుంటున్నాడు. లక్ష్మికి అనుమానం వచ్చి మెడికల్ షాప్ కి వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. ఇప్పుడు కూడా తను నాలుగో నెల గర్భవతి అని చెప్పింది. కడుపులో గట్టిగా దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం ఎక్కువగా అయితుంది. ప్రెగ్నెన్సీ ఉంటదో పోతదో తెలవదు అని డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలని నాకు న్యాయం చేయండి అని మీ సపోర్టు కావాలని కోరుతూ ఐద్వా నాయకులకు తన గోడు వెళ్ళబోసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు పడాలి. లేదంటే మహిళల జీవితాలతో ఆడుకుంటూ సమాజంలో మగవారు అంటేనే విరక్తి పుట్టేలా ఇలాంటి కీచకులు చేస్తున్న పనికి సరైన పనిష్మెంట్ జరగకపోతే రేపు రానున్న రోజుల్లో ఇంకా విచ్చలవిడిగా హింస పెరిగిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి శ్రీకాంత్ కి జీవిత ఖైదు శిక్ష వేసి బయటకు రాకుండా చేయాలి. అతనిపై ఉన్న కేసులు వెనక్కి తీసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. లేదంటే వాడిని జైలుకు పంపేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, ఆ అమ్మాయికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు కళా స్వప్న పాల్గొన్నారు.
బాధితురాలిని పరామర్శించిన ఐద్వా నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES